Kannappa: ‘కన్నప్ప’లో ప్రీతి

మంచు విష్ణు సరసన మలయాళ భామ ప్రీతి ముకుందన్‌ నటించనున్నారు. ‘కన్నప్ప’ చిత్రం కోసం ఆమెని కథానాయికగా  ఎంపిక చేసినట్టు చిత్రవర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది.

Updated : 15 Dec 2023 09:35 IST

మంచు విష్ణు సరసన మలయాళ భామ ప్రీతి ముకుందన్‌ నటించనున్నారు. ‘కన్నప్ప’ చిత్రం కోసం ఆమెని కథానాయికగా  ఎంపిక చేసినట్టు చిత్రవర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తన కలల చిత్రంగా మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. వివిధ భాషలకి చెందిన పలువురు అగ్ర నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పలువురు కథానాయికలతో ఆడిషన్స్‌ నిర్వహించాక భరతనాట్యంలో నిష్ణాతురాలైన ప్రీతిని ఎంపిక చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి. పోరాట ఘట్టాలతోపాటు, నృత్య నైపుణ్యంతో ప్రేక్షకుల్ని కనువిందు చేసే పాత్రలో ప్రీతి కనిపిస్తుందని, ఈ పాత్రకి తగిన నటి అని దర్శకుడు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని