Mrunal Thakur: బాలీవుడ్‌లో ప్రేమకథలు.. ఆ విషయంలో విసిగిపోయా: మృణాల్‌ ఠాకూర్

బాలీవుడ్‌లో అవకాశాలపై నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) స్పందించారు. తనకు ప్రేమకథా చిత్రాల్లో నటించాలని ఉందన్నారు.

Published : 25 Jan 2024 16:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టాలీవుడ్‌లో వరుస ప్రేమకథా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నారు నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) సక్సెస్‌లో భాగంగా బాలీవుడ్‌లో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారామె. హిందీలో రొమాంటిక్‌ చిత్రాలు ఓకే చేయకపోవడంపై తాజాగా ఆమె స్పందించారు. ఆ జానర్‌ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి తనకీ ఉందన్నారు.

‘‘హిందీలో రొమాంటిక్‌ చిత్రాల్లో అవకాశాలు నాకు ఎందుకు రావడం లేదో తెలీదు. ప్రేమకథల్లో నటించే అంతటి పాపులారిటీ నాకింకా రాలేదు అనుకుంటా. ఇప్పటివరకూ నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా వాటిల్లో రొమాంటిక్‌ కథలు మాత్రం లేవు. ఆ జానర్‌ చిత్రాల్లో నటించాలని ఉంది. అలాంటివి నేను కూడా చేయగలనని నిరూపించుకోవడంలో విసిగిపోయా. ఇప్పటికే ఎంతోమందిని అడిగా. ఇకపై అది సహజంగా జరగాలని కోరుకుంటున్నా.

Fighter Movie Review: రివ్యూ: ఫైట‌ర్‌.. హృతిక్‌ యాక్షన్ మూవీ మెప్పించిందా?

బాలీవుడ్‌లో ఎన్నో ఉత్తమమైన ప్రేమకథా చిత్రాలు తెరకెక్కాయి. ఆ జానర్‌ సినిమాలు చూస్తూ పెరిగా. ‘హాయ్‌ నాన్న’, ‘సీతారామం’ వంటి మనసుని హత్తుకునే ప్రేమకథా చిత్రాల్లో నటించినందుకు సంతోషంగా ఉన్నా. నన్ను క్వీన్‌ ఆఫ్‌ రొమాన్స్‌ అని పిలుస్తున్నారు. అందుకు గర్వపడుతున్నా. ఎందుకంటే.. షారుక్‌ను కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌ అంటారు కదా’’ అని ఆమె చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని