Dasara: నాని.. ధూమ్‌ ధామ్‌ దోస్తానా

విజయదశమి సందర్భంగా ‘దసరా’ నుంచి ఓ కానుక అందించనున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్‌ కథానాయిక. ప్రస్తుతం శరవేగంగా

Updated : 30 Sep 2022 09:27 IST

విజయదశమి సందర్భంగా ‘దసరా’ (Dasara) నుంచి ఓ కానుక అందించనున్నారు నాని (Nani) . ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్‌ కథానాయిక. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలోని తొలి గీతాన్ని దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నాని. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ఓ ప్రత్యేక వీడియోని పంచుకున్నారు. ‘ధూమ్‌ ధామ్‌ దోస్తానా’ అంటూ సాగే ఈ మాస్‌ పాటకు సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చగా.. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఇంత వరకు రాని మాస్‌ స్ట్రీట్‌ పాటగా ఇది అందరినీ అలరిస్తుందని నాని తెలిపారు. తెలంగాణలోని ఓ పల్లెటూరి నేపథ్యంగా సాగే మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని