Dear Students: ‘డియర్‌ స్టూడెంట్స్‌’ సందడి మొదలు

ఇటీవలే ‘డియర్‌ స్టూడెంట్స్‌’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్‌ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్‌ కుమార్‌, జార్జ్‌ ఫిలిప్‌రాయ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

Updated : 08 May 2024 09:41 IST

టీవలే ‘డియర్‌ స్టూడెంట్స్‌’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్‌ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్‌ కుమార్‌, జార్జ్‌ ఫిలిప్‌రాయ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ విషయాన్ని నయన్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది. ఈ చిత్రం కాలేజీ పిల్లల చుట్టూ తిరిగే కథనంతో ఎంతో వినోదాత్మకంగా రూపొందుతున్నట్లు కొన్ని రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్‌ స్పష్టం చేస్తోంది. నివిన్‌, నయన కలయికలో 2019లో వచ్చిన ‘లవ్‌ యాక్షన్‌ డ్రామా’ ప్రేక్షకుల్ని అలరించింది. ఇన్నేళ్లకు మళ్లీ ఈ జోడీ నటిస్తున్న ‘డియర్‌ స్టూడెంట్స్‌’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో నయనతార  టీచర్‌గా కనిపించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈమె నటించిన ‘టెస్ట్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని