Khakee Season 2: నీరజ్‌ పాండే ‘ఖాకీ: సీజన్‌-2’ వచ్చేస్తోంది!

నీరజ్‌ పాండే దర్శకత్వంలో గతేడాది నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్ ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’.

Updated : 22 Aug 2023 16:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నీరజ్‌ పాండే దర్శకత్వంలో గతేడాది నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్ ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’. మొత్తం ఏడు ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌ ఆద్యంతం ఉత్కంఠతో అలరించింది. ఐపీఎస్‌ అధికారి అమిత్‌ లోథా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ‘సీజన్‌-1’ను తెరకెక్కించారు నీరజ్‌ పాండే. ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ సిరీస్‌కు కొనసాగింపు ఉంటుందని చివరిలో చెప్పారు. అన్నట్లుగానే ఇప్పుడు ‘ఖాకీ: సీజన్‌2’ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ టీజర్‌ను పంచుకుంది. సీజన్‌2కు కూడా నీరజ్‌పాండే దర్శకత్వం వహిస్తున్నారు. సీజన్‌-1ను బిహార్‌ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కించగా, ఇప్పుడు ఏ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని