Veera Simha Reddy: ‘వీర సింహారెడ్డి’.. పవర్ఫుల్ మాస్ డైలాగులు.. థియేటర్స్‌లో విజిల్స్..
నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీర సింహారెడ్డి’. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులతో ఈలలు వేయిస్తున్నాయి.
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ (Bala Krishna).. ఈ పేరు వినగానే మాస్ డైలాగ్‌లు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు కోరుకుంటారు సినీ ప్రియులు. దర్శక నిర్మాతలు సైతం అందుకు అనుగుణంగానే కథలు సిద్ధం చేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ‘వీర సింహారెడ్డి’లో (Veera Simha Reddy) అభిమానులతో ఈలలు వేయించే పవర్ఫుల్ సంభాషణలను గోపీచంద్ మలినేని ఉపయోగించారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, రాయలసీమ సంస్కృతి గురించి సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ థియేటర్స్‌లో ఈలలు వేయిస్తున్నాయి. ఇంతకీ అవి ఏమిటంటే..!
- ‘‘అన్నం మీద గౌరవం లేని వాడు ఆకలికి పనికిరాడు.. అమ్మ మీద గౌరవం లేనివాడు భూమికి పనికి రాడు’’
- ‘‘కోసేవాడికి కోడి మీద పగ ఉండదు.. నేనూ అంతే. చాలా పద్ధతిగా నరుకుతా’’
- ‘‘సెంట్రల్ అయినా.. స్టేట్ అయినా.. రాజకీయాల మీద బతికే మనిషిని కాదు.. రాజకీయాల్ని మార్చే మనిషిని’’
- ‘‘సమాధానం చెప్పలేని వాడికి ప్రశ్నించే హక్కు లేదు’’
- ‘‘నన్ను తట్టుకొని నిలవాలంటే మూడే దారులు. మారిపోవాలి.. పారిపోవాలి.. లేదంటే సచ్చిపోవాలి’’
- ‘‘నువ్వు సవాలు విసరకు.. నేను శవాలు విసురుతా’’
- ‘‘నేనెవరో చెప్పే అలవాటు నాకు లేదు. జీవోను ఉన్నది ఉన్నట్టుగా అమలు చేస్తా. నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్. నా జీవో గాడ్స్ ఆర్డర్’’
- ‘‘ఏది అభివృద్ధి హోం మినిస్టర్.. ప్రగతి సాధించడం అభివృద్ధి.. ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమెయ్యడం కాదు. పని చెయ్యడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలు మూయడం కాదు. బుద్ధి తెచ్చుకో.. అభివృద్ధికి అర్థం తెలుసుకో’’
- ‘‘సింహం మనిషైతే మీ నాన్న.. మంది గుండెల్లో ధైర్యం మీ నాన్న..! ఆ పేరు వింటే వేట కొడవళ్ల వెన్నెముకలు వణుకుతాయి. భూమ్మీద బతకడానికి అందరూ పుడతారు. కానీ, భూమిని బతికించడానికి పుట్టిన సింహాం మీ నాన్న’’
- ‘‘దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు ఆరుగురు ముఖ్యమంత్రుల్ని ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తిన మహనీయుడ్ని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఇది రాయల్ సీమ. గజరాజులు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు.. కుక్కను కాదు..’’
- ‘‘సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తిపట్టా. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు. సీమ మీద ఎఫెక్షన్. వీర సింహారెడ్డి పుట్టింది పులిచర్ల. చదివింది అనంతపురం. రూలింగ్ కర్నూలు’’
- ‘‘అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను.. లొకేషన్ చూడను.. ఒంటి చేత్తో ఊచకోత.. కోస్తా..’’
- ‘‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు’’
- ‘‘పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Aamir Khan: ఆ సీన్లో నగ్నంగా నటించాను: ఆమిర్ ఖాన్
రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. -
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
‘పొలిమేర2’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
బాలీవుడ్ స్టార్స్‌తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. -
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు.