Kalki: ‘కల్కి’... విడుదల అదే రోజున

మే 9. - ఈ తేదీకీ... ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌కీ ఎంతో అనుబంధం ఉంది. ఈ సంస్థ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’, ‘మహర్షి’ చిత్రాలు మే 9నే విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. ‘కల్కి 2898 ఎ.డి’ చిత్రాన్ని కూడా అదే రోజునే విడుదల చేస్తున్నట్టు శుక్రవారం నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Updated : 13 Jan 2024 10:02 IST

మే 9. - ఈ తేదీకీ... ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌కీ ఎంతో అనుబంధం ఉంది. ఈ సంస్థ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’, ‘మహర్షి’ చిత్రాలు మే 9నే విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. ‘కల్కి 2898 ఎ.డి’ చిత్రాన్ని కూడా అదే రోజునే విడుదల చేస్తున్నట్టు శుక్రవారం నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్‌ కథానాయకుడిగా... నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పఠానీ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌ సంస్థ యాభయ్యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలోనే ఈ చిత్రం ఆ సంస్థలో రూపుదిద్దుకోవడం విశేషం. వారణాసి, ముంబయి, దిల్లీ, చండీగఢ్‌, చెన్నై, మధురై, హైదరాబాద్‌ సహా దేశంలోని ప్రధానమైన పలు నగరాల్లో రైడర్స్‌ కవాతుద్వారా ఈ సినిమా విడుదల తేదీ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ మాట్లాడుతూ ‘‘మా సంస్థ ప్రయాణం మరింత అర్థవంతంగా మారుతున్న సందర్భం ఇది. మే 9కి మా సంస్థలో ఎంతో ప్రాధాన్యం ఉంది. అదే రోజున ‘కల్కి 2898 ఎ.డి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం ఆనందంగా ఉంది. గొప్ప నటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు కలిసి చేసిన చిత్రమిది’’ అన్నారు. పురాణాల స్ఫూర్తితో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు నాగ్‌ అశ్విన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని