Adipurush: ఆదిపురుషుడు

ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్‌’ ఒకటి. రామాయణం ఆధారంగా అత్యున్నత సాంకేతికతతో రూపొందిన చిత్రమిది. ప్రభాస్‌ కథానాయకుడు. కృతిసనన్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌, సన్నీసింగ్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated : 01 Oct 2022 14:03 IST

ప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్‌’ (Adipurush) ఒకటి. రామాయణం ఆధారంగా అత్యున్నత సాంకేతికతతో రూపొందిన చిత్రమిది. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడు. కృతిసనన్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌, సన్నీసింగ్‌ కీలక పాత్రలు పోషించారు. ఓం రౌత్‌ దర్శకుడు. వంశీ, ప్రమోద్‌ భాగస్వామ్యంలో టి.సిరీస్‌, రెట్రో ఫైల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు దసరా నవరాత్రుల్లో భాగంగా షురూ అవుతున్నాయి. అక్టోబరు 2న అయోధ్యలో టీజర్‌ని విడుదల చేయనున్నారు. శుక్రవారం తొలి పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో  బాణాన్ని ఆకాశానికేసి ఎక్కుపెడుతూ కనిపించారు ప్రభాస్‌. చెడుపై మంచి గెలుపు చుట్టూ సాగే కథ ఇదని పేర్కొంది చిత్రబృందం. ప్రభాస్‌ రాఘవగా, కృతిసనన్‌ జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌ లంకేశ్‌ పాత్రల్లో కనిపిస్తారు. త్రీడీతోపాటు, ఐమాక్స్‌ ఫార్మేట్‌లో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని