Prithviraj: యుద్ధానికి సిద్ధమైన ‘పృథ్వీరాజ్‌’

ప్రేమ, శౌర్యం, ధర్మం మూర్తీభవించిన మహా వీరుడు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పాత్రలో అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న చిత్రం ‘పృథ్వీరాజ్‌’. మానుషి ఛిల్లర్‌ కథానాయిక. సోనూసూద్‌, సంజయ్‌దత్‌ ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారు. సుదీర్ఘకాలంగా ప్రేక్షకులను ఊరిస్తున్న

Updated : 10 May 2022 12:26 IST

ప్రేమ, శౌర్యం, ధర్మం మూర్తీభవించిన మహా వీరుడు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పాత్రలో అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న చిత్రం ‘పృథ్వీరాజ్‌’. మానుషి ఛిల్లర్‌ కథానాయిక. సోనూసూద్‌, సంజయ్‌దత్‌ ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారు. సుదీర్ఘకాలంగా ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ చిత్రం జూన్‌ 3న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ సోమవారం విడుదల చేశారు. శక్తిమంతమైన సంభాషణలు, రోమాలు నిక్కబొడుచుకునే పోరాట దృశ్యాలు ఇందులో కనిపించాయి. పృథ్వీరాజ్‌ చౌహాన్‌ భార్య సంయోగితగా మానుషి అలరించనుంది. వీరిద్దరి మధ్యా వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయని సమాచారం. మహమ్మద్‌ ఘోరీడి మానవ్‌ విజ్‌.. అక్షయ్‌కుమార్‌తో తలపడనున్నాడు. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని