Abhiram Daggubati: అభిరామ్ ‘అహింస’
కొత్త నటుల్ని తెరకు పరిచయం చేయడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు తేజ. కొత్త తరంతో కలిసి ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్నారాయన. ఈసారి డి.రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటిని పరిచయం చేస్తున్నారు.
కొత్త నటుల్ని తెరకు పరిచయం చేయడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు తేజ. కొత్త తరంతో కలిసి ఎన్నో విజయాల్ని సొంతం చేసుకున్నారాయన. ఈసారి డి.రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటిని పరిచయం చేస్తున్నారు. తేజ - అభిరామ్ కలయికలోని సినిమాని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. దర్శకుడు తేజ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఈ సినిమా పేరుని ప్రకటించడంతోపాటు, ప్రి లుక్‌ని విడుదల చేశారు. ‘అహింస’ అనే పేరుని ఖరారు చేసినట్టు తెలిపింది చిత్రబృందం. రక్తం కారుతున్న ముఖంతో ఉన్న ప్రి లుక్‌ని విడుదల చేశారు. ఆర్.పి.పట్నాయక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు: చంద్రబోస్, పోరాటాలు: రియల్ సతీష్.
‘విక్రమాదిత్య’ మొదలు
‘అహింస’ చిత్రీకరణని పూర్తి చేసిన తేజ... ‘విక్రమాదిత్య’ ఓ ప్రేమకథని తెరకెక్కిస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రం 1836వ సంవత్సరంలో సాగే కథతో తెరకెక్కనుంది. ఆ సమయంలోనే సర్ ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించారనీ, ఈ కథకీ... ఆ వంతెనకీ సంబంధం ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. మంగళవారమే చిత్రీకరణని ప్రారంభించారు. తేజ దర్శకత్వం వహించిన ‘జయం’ చిత్రీకరణ సరిగ్గా 20 ఏళ్ల కిందట ఇదే సమయంలో మొదలైందని, ‘విక్రమాదిత్య’ ఆయన కలల ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతుందని ఈ సినీ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్‌లో సెట్లోకి
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్‌పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్‌కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్