Sonal Chauhan: ఇదే తొలిసారి

పూర్తిస్థాయి కామెడీ సినిమా చేయడం నా కెరీర్‌లో ఇదే తొలిసారని చెప్పుకొచ్చింది కథానాయిక సోనాల్‌ చౌహాన్‌. ‘లెజెండ్‌’, ‘పండగ చేస్కో’, ‘డిక్టేటర్‌’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన....

Updated : 14 May 2022 12:31 IST

పూర్తిస్థాయి కామెడీ సినిమా చేయడం నా కెరీర్‌లో ఇదే తొలిసారని చెప్పుకొచ్చింది కథానాయిక సోనాల్‌ చౌహాన్‌. ‘లెజెండ్‌’, ‘పండగ చేస్కో’, ‘డిక్టేటర్‌’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఆమె ఇటీవల ‘ఎఫ్‌3’లో ఓ కీలక పాత్ర పోషించింది. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌  కథానాయకులుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోనాల్‌ మాట్లాడుతూ ‘‘ఆశ్చర్యకరమైన పాత్రలో నేను కనిపిస్తా. నా పాత్రని అందుకే ట్రైలర్‌లోనూ చూపించకుండా దాచిపెట్టారు. కామెడీ చేయడం అంత తేలిక కాదు. ఓ సవాల్‌గా భావించి ఈ సినిమా చేశా. ‘ఏవైనా  సినిమాలు చూసి సిద్ధం కావాలా?’ అని దర్శకుడిని అడిగా. ‘ఏమీ ఆలోచించకుండా నేరుగా సెట్‌కి వచ్చేయ్‌’ అని చెప్పారు. అనిల్‌లో స్పష్టత ఎక్కువ. ఆయన నటించి చూపిస్తారు. ఆయన చెప్పినట్టు చేస్తే చాలు. ‘లెజెండ్‌’ చేస్తున్నప్పుడే నాకు అనిల్‌తో పరిచయమైంది. అప్పుడే ఆయన మనం కలిసి పనిచేద్దామని చెప్పారు. ఇన్నాళ్ల తర్వాత ఆయన నుంచి ఫోన్‌ రావడంతో వెంటనే ‘ఎఫ్‌3’ చేయడానికి ఒప్పుకొన్నా. ఇందులో వెంకటేష్‌తో కలిసి నటించడం ఓ గౌరవం. నా తొలి షాట్‌ ఆయనతోనే. మొదట కంగారుపడినా చాలా సరదాగా పూర్తయింది. వరుణ్‌తేజ్‌ చాలా ఫ్రెండ్లీ. తమన్నా, మెహ్రీన్‌ అంతా స్నేహితుల్లా కలిసిపోయి నటించాం. ఈ సినిమా ప్రయాణం ఓ మంచి అనుభవమ’’ని చెప్పింది. ప్రస్తుతం నాగార్జునతో కలిసి ‘ది ఘోస్ట్‌’ సినిమా చేస్తున్నట్టు ఆమె తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని