Sri Leela: ప్రణవి ‘ధమాకా’

రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. శ్రీలీల కథా నాయిక. మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ కొత్త లుక్‌ విడుదల చేశారు. అందులో శ్రీలీల నుదుటిపై చేయి పెట్టుకొని క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందంగా కనిపించింది.

Updated : 15 Jun 2022 07:39 IST

వితేజ హీరోగా నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. శ్రీలీల కథా నాయిక. మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ కొత్త లుక్‌ విడుదల చేశారు. అందులో శ్రీలీల నుదుటిపై చేయి పెట్టుకొని క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందంగా కనిపించింది. ఆమె ఇందులో ప్రణవిగా అలరించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కథ, మాటలు: బెజవాడ ప్రసన్న కుమార్‌, ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని