ఫొటోలు: కేరళ ప్రేమలో.. సన్నీ లియోని

కేరళ సంప్రదాయం అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు? కొబ్బరి చెట్లు, మహిళల కట్టూబొట్టుకు దేశమంతా ఫిదా అవుతుంది. బాలీవుడ్‌ నటి

Published : 19 Feb 2021 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళ సంప్రదాయం అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు? కొబ్బరి చెట్లు, మహిళల కట్టూబొట్టుకు దేశమంతా ఫిదా అవుతుంది. బాలీవుడ్‌ నటి సన్నీలియోనికి కూడా అక్కడి వాతావరణం, పద్ధతులు అమితంగా నచ్చేశాయట. ఆ ఇష్టాన్ని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లో చూపించింది. కేరళ చీరకట్టులో ఆమె ఒదిగిపోయింది. చేతినిండా గాజులు వేసుకుని, చెవులకు దిద్దులు, కాళ్లకు పట్టీలు ధరించి  కనువిందు చేస్తోంది. నుదుట బొట్టు పెట్టుకుని ట్రెడిషనల్‌ లుక్‌లో అందరిదృష్టిని ఆకర్షిస్తోంది.

సముద్ర తీరంలో పడవపై ప్రయాణిస్తూ దిగిన ఫొటోల్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘కేరళతో ప్రేమలో ఉన్నా’ అనే వ్యాఖ్యను జతచేసింది. గతంలో కేరళలో వరదలొచ్చినప్పుడు సన్నీ లియోనీ అక్కడి ప్రజలకు తన వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రముఖ టెలివిజన్‌ నిర్వహిస్తోన్న రియాలిటీ షో ‘స్ల్పిట్స్‌విల్లా 13’కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమ చిత్రీకరణ కోసం ఆమె కేరళ విచ్చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని