Sri Simha: శ్రీసింహా చిత్రం ప్రారంభం

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భాగ్‌ సాలే’. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌ రంగినేని, శింగనమల కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. డి.సురేష్‌బాబు సమర్పకులు.

Updated : 26 Oct 2021 07:06 IST

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భాగ్‌ సాలే’. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌ రంగినేని, శింగనమల కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్‌శంకర్‌ క్లాప్‌నిచ్చారు. నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ‘‘కథానాయకుడు శ్రీసింహా ‘మత్తు వదలరా’, ‘తెల్లవారితే గురువారం’ తర్వాత చేస్తున్న చిత్రమిది. క్రైమ్‌ కామెడీ కథతో రూపొందుతోంది. కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. కొత్త రకమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని