మరో రీమేక్ కథతో ఆమిర్?
బాలీవుడ్ కథా నాయకుడు ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. హాలీవుడ్లో విజయవంతమైన ‘ఫారెస్ట్ గంప్’ సినిమాకి రీమేక్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది
బాలీవుడ్ కథా నాయకుడు ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. హాలీవుడ్లో విజయవంతమైన ‘ఫారెస్ట్ గంప్’ సినిమాకి రీమేక్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమీర్ చేయబోయే చిత్రమేంటన్నది ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన మరో రీమేక్ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. విజయవంతమైన స్పానిష్ సినిమా ‘కాంపియోన్స్’ను ఆమిర్ హిందీలో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని.. వచ్చే ఏడాది సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ప్రచారం వినిపిస్తోంది. అలాగే గుల్షన్ కుమార్ జీవిత కథలోనూ ఆమిర్ నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.