Anasuya: అనసూయ ఆకర్షణ

ప్రత్యేక గీతాల్లోనే కాదు... బలమైన పాత్రల్లోనూ సందడి చేస్తుంటుంది అనసూయ. ఆమె ప్రధాన పాత్రధారిగా ‘ఫ్లాష్‌బ్యాక్‌’ తెరకెక్కింది. రెజీనా, ప్రభుదేవా ముఖ్య పాత్రలు పోషించారు. డాన్‌ సాండీ దర్శకత్వం

Updated : 27 Nov 2021 08:00 IST

ప్రత్యేక గీతాల్లోనే కాదు... బలమైన పాత్రల్లోనూ సందడి చేస్తుంటుంది అనసూయ. ఆమె ప్రధాన పాత్రధారిగా ‘ఫ్లాష్‌బ్యాక్‌’ తెరకెక్కింది. రెజీనా, ప్రభుదేవా ముఖ్య పాత్రలు పోషించారు. డాన్‌ సాండీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనసూయ అందం, అభినయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల ఈ సినిమా లుక్‌ని విడుదల చేశారు. రెజీనా ఆంగ్లో ఇండియన్‌ టీచర్‌గా, అనసూయ.. ప్రభుదేవా విభిన్నమైన పాత్రల్లోనూ సందడి చేస్తారని దర్శకనిర్మాతలు తెలిపారు. బలమైన భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెలుగులో  ఏఎన్‌ బాలాజీ విడుదల చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని