MAA Elections: మంచువిష్ణుకు బాలకృష్ణ మద్దతు

నటీనటుల వాడీవేడీ చర్చలు.. హోరాహోరీ ప్రచారాలతో ‘మా’ ఎన్నికలు సాధారణ రాజకీయాలను తలపిస్తున్నాయి. మరికొన్నిరోజుల్లో జరగనున్న ఎన్నికల్లో నటుడు బాలకృష్ణ తనకే సపోర్ట్‌ చేస్తున్నారని మంచు విష్ణు తెలిపారు...

Updated : 03 Oct 2021 15:48 IST

హైదరాబాద్‌: నటీనటుల విమర్శలు, ప్రతి విమర్శలతో ‘మా’ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో నటుడు బాలకృష్ణ తనకే మద్దతు ఇస్తున్నారని అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ‘అఖండ’ సెట్‌కు వెళ్లిన విష్ణు కాసేపు బాలయ్యతో ముచ్చటించారు. తన మేనిఫెస్టో గురించి వివరించారు. ‘మా’ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం తాను చేపట్టనున్న కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. తన అభిప్రాయాలతో ఏకీభవించిన బాలయ్య తనకు మద్దతు ప్రకటించారని విష్ణు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ ట్వీట్‌ పెట్టారు. ‘బాలా అన్న.. మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు. మీరు నాకు మద్దతు తెలపడం ఎంతో గర్వంగా ఉంది’ అని విష్ణు పోస్టు పెట్టారు. మరోవైపు ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్రధానంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని