Pooja Hegde: పూజ డెడికేషన్‌కి ఫిదా అయ్యా... అలా చేసింది మరి!

‘బొమ్మరిల్లు’, ‘ఆరెంజ్‌’, ‘పరుగు’ వంటి ఫీల్‌గుడ్‌ ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు భాస్కర్‌. ‘బొమ్మరిల్లు’తో కెరీర్‌ ఆరంభంలోనే మంచి విజయాన్ని...

Published : 01 Oct 2021 01:49 IST

పూజాహెగ్డేపై దర్శకుడు కామెంట్లు

హైదరాబాద్‌: ‘బొమ్మరిల్లు’, ‘ఆరెంజ్‌’, ‘పరుగు’ వంటి ఫీల్‌గుడ్‌ ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు భాస్కర్‌. ‘బొమ్మరిల్లు’తో కెరీర్‌ ఆరంభంలోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన చాలా సంవత్సరాల తర్వాత మరోసారి హిట్‌ అందుకోవడం కోసం చేసిన ప్రయత్నమే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అఖిల్‌ అక్కినేని-పూజాహెగ్డే జంటగా నటించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో భాస్కర్‌-అఖిల్‌ స్పెషల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. భాస్కర్ తెరకెక్కించే కథల్లో ఫీల్‌ మాత్రమే కాకుండా సోలో కూడా ఉంటుందని.. అలాంటిది ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించడం ఆనందంగా ఉందని అఖిల్‌ అన్నారు. ‘ఆరెంజ్‌’ సినిమా తనకెంతో ఇష్టమని తెలిపారు. పూజా గురించి స్పందిస్తూ.. పని పట్ల ఆమెకు ఎంతో అంకితభావం ఉందని.. ఒకేసారి ఆరు సినిమా షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నప్పటికీ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంతో సరదాగా షూట్‌లో పాల్గొంది అని అఖిల్‌ అన్నారు.

అనంతరం దర్శకుడు భాస్కర్‌.. పూజాహెగ్డే గురించి మాట్లాడుతూ ‘మా సినిమా ఒక యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులో పూజాహెగ్డే స్టాండప్‌ కమెడియన్‌ రోల్‌లో కనిపించనున్నారు. అయితే, హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేసుకున్న తర్వాత.. ‘ఆమెకు ఉన్న స్టార్‌డమ్‌ని పక్కనపెడితే ఇందులో ఆమె రోల్‌ ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అందులోనూ స్టాండప్ కమెడియన్‌ చాలా క్లిష్టమైన పాత్ర. ఒకవేళ ఆమె సరిగ్గా చేయకపోతే ఏం చేయాలి’ అని నిర్మాత బన్నీ వాసుని అడిగాను. షూట్‌ ప్రారంభించిన తర్వాత ఆమెకు ఉన్న డెడికేషన్‌ చూసి నేను ఫిదా అయ్యాను. ఆమె చాలా బాగా నటిస్తుందని బన్నీవాసుకి చెప్పాను’ అని అన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని