RGV: ప్రేమపాటకు ఆర్జీవీ ఫిదా

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, సినిమాలతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మొదటిసారి ఓ ప్రేమ పాటకు ఫిదా అయ్యారు. పాట సూపర్‌గా ఉందంటూ ట్వీట్‌ చేశారు......

Published : 21 Jul 2021 15:29 IST

వావ్‌ అంటూ కామెంట్‌

హైదరాబాద్‌: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, సినిమాలతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మొదటిసారి ఓ ప్రేమ పాటకు ఫిదా అయ్యారు. పాట సూపర్‌గా ఉందంటూ ట్వీట్‌ చేశారు. సునీల్‌ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘కనబడుటలేదు’. వైశాలీరాజ్‌, సుక్రాంత్‌, హిమజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ‘స్పార్క్‌’ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘కనబడుట లేదు’ నుంచి ‘తొలిసారి నేనే’ అనే పాటను కాజల్‌ విడుదల చేశారు. ఈ అందమైన మెలోడిని విడుదల చేయడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.

కాగా, ఈ పాట లిరికల్‌ వీడియోని షేర్‌ చేసిన ఆర్జీవీ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి బాలరాజు ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సునీల్‌ మర్డర్‌ మిస్టరీని ఛేదించే గూఢాచారిగా సీరియస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని