Kinnerasani: ఉత్కంఠగా ‘కిన్నెరసాని’ టీజర్
‘కిన్నెరసాని’ టీజర్‌ని విడుదల చేసిన నటుడు నితిన్. కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రమిది.
ఇంటర్నెట్ డెస్క్: కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా రమణ్ తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిన్నెరసాని’. శీతల్ కథానాయిక. ఈ సినిమా టీజర్ నటుడు నితిన్ శుక్రవారం విడుదల చేశారు. ఓ బీచ్ సన్నివేశంతో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘అద్భుతం జరిగే ప్రతిచోటా ఆపదలుంటాయి’, ‘ఈ ప్రపంచంలో ప్రతిదానికీ ఓ లిమిట్ ఉండాలి. అది ద్వేషానికైనా.. చివరకి ప్రేమకైనా’ అనే సంభాషణలు ప్రధానంగా నిలిచాయి. నటీనటుల హావభావాలు, లొకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ప్రచార చిత్రాన్ని బట్టి చూస్తుంటే క్రైమ్, సస్పెన్స్ అంశాలతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు అర్థమవుతోంది. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నటుడు చిరంజీవి చిన్నల్లుడైన కల్యాణ్‌దేవ్.. ‘విజేత’ చిత్రంతో నటుడిగా మారిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్‌లో సెట్లోకి
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.