rowdy boys: ‘రౌడీ బాయ్స్’ పాట సందడి
‘ప్రేమే ఆకాశమైతే ఓ మై జాను... అందులో ఎగిరే పక్షులంట నువ్వు నేను...’’ అంటూ పాడుకున్నాడు రౌడీబాయ్. అతని ప్రేమకథేమిటో తెలియాలంటే ‘రౌడీ బాయ్స్’ చూడాల్సిందే
‘ప్రేమే ఆకాశమైతే ఓ మై జాను... అందులో ఎగిరే పక్షులంట నువ్వు నేను...’’ అంటూ పాడుకున్నాడు రౌడీబాయ్. అతని ప్రేమకథేమిటో తెలియాలంటే ‘రౌడీ బాయ్స్’ చూడాల్సిందే. ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో గీతమైన ‘ప్రేమ ఆకాశమైతే...’ని బుధవారం యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరకల్పనలోని ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, జస్ప్రీత్ జస్జ్ ఆలపించారు. ఈ పాట విడుదల కోసం హైదరాబాద్‌లో ఓ వేడుకని నిర్వహించారు. విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. త్వరలో దిల్‌రాజు నిర్మాణంలో సినిమా చేయనున్నట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్‌హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..