SR Kalyanamandapam: డబ్బు సంపాదిస్తేనే విలువ: సాయికుమార్‌

‘పది రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపున పుట్టినవాడు కూడా మనకి విలువివ్వడు’ అని అంటున్నారు నటుడు సాయికుమార్‌. ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’. కిరణ్‌ అబ్బవరం, ప్రియాంకా జువాల్కర్‌....

Published : 28 Jul 2021 15:56 IST

హైదరాబాద్‌: ‘పది రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపున పుట్టినవాడు కూడా మనకి విలువివ్వడు’ అని అంటున్నారు నటుడు సాయికుమార్‌. ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’. కిరణ్‌ అబ్బవరం, ప్రియాంకా జువాల్కర్‌ జంటగా నటించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా సినీ ప్రియులతో పంచుకుంది.

ఇందులో సాయికుమార్‌-కిరణ్‌ తండ్రీకొడుకులుగా ఆకట్టుకున్నారు. ‘డబ్బుల్ది ఏముందిరా వస్తాయ్‌ పోతాయ్‌. మనం బతికే బతుకు కదా ముఖ్యం. నేను ఎంత పోగొట్టినా ఎవడి సొమ్ము తినలా’ అంటూ సాయికుమార్‌ చెప్పే బరువైన డైలాగులు ప్రతి ఒక్కర్నీ మెప్పించేలా ఉన్నాయి. కిరణ్‌, సాయికుమార్‌ నటన, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని