Vijay Devarakonda: ప్రభాస్‌ విషయంలో నెటిజన్‌కు మాటిచ్చిన విజయ్‌ దేవరకొండ

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ విషయంలో ఓ నెటిజన్‌కు మాటిచ్చాడు టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ‘లైగర్‌’ షూట్‌లో ఫుల్‌ బిజీగా ఉంటున్న విజయ్‌ కొంత బ్రేక్‌ తీసుకుని.. సోషల్‌మీడియా వేదికగా తన రౌడీలతో...

Published : 16 Oct 2021 02:06 IST

హైదరాబాద్‌: పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ విషయంలో ఓ నెటిజన్‌కు మాటిచ్చాడు టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ‘లైగర్‌’ షూట్‌లో ఫుల్‌ బిజీగా ఉంటున్న విజయ్‌ కొంత బ్రేక్‌ తీసుకుని.. సోషల్‌మీడియా వేదికగా తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు. తనపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ పలువురు అభిమానులు చేసిన వీడియో ఎడిటింగ్స్ చూసిన ఆయన వాళ్లందరికీ రిప్లై ఇచ్చారు. వీడియో ఎడిటింగ్స్‌ చాలా బాగున్నాయని.. త్వరలోనే కలుస్తానని మాటిచ్చారు.

ఇందులో భాగంగా విశాల్‌ అనే నెటిజన్‌.. ‘అన్న నేను మీకు పెద్ద అభిమానిని. మాది కూడా మహబూబ్‌ నగరే. ఈ సారి ఇక్కడికి వచ్చినప్పుడు.. మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తాను. మన రౌడీలందరితో కలిసి ఏవీడీలోనే సినిమా చూద్దాం’ అని గత నెలలో ట్వీట్‌ చేయగా.. దానిపై తాజాగా విజయ్‌ స్పందించారు. ‘విశాల్‌.. మన రౌడీలందరితో కలిసి తప్పకుండా సినిమా చూద్దాం. ఆ విధంగా నేను ప్లాన్‌ చేస్తా. ఈసారి మన ఇంటికి వస్తున్నా.. అక్కడే లంచ్‌, డిన్నర్‌’ అని రిప్లై ఇచ్చారు.

అబ్బాస్‌ అనే మరో నెటిజన్‌ ‘కేవలం ఏవీడీ థియేటర్‌ని చూడటం కోసమే బెంగళూరు నుంచి 450 కిలోమీటర్లు ట్రావెల్‌ చేసి మహబూబ్‌ నగర్‌ వచ్చాను. లవ్‌ యూ విజయ్‌’ అని ట్వీట్‌ చేయగా.. ‘మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇకపై, ఒక సంవత్సరం పాటు ఏవీడీకి నువ్వు ఎంతమందితో కలిసి సినిమా చూడటానికి వెళ్లినా సరే.. ఆ టిక్కెట్‌ ఖర్చులు నేనే పెట్టుకుంటాను. కాకపోతే.. నువ్వు సినిమా చూడటానికి ఒక్కరోజు ముందు నాకు, నా టీమ్‌కి ట్వీట్‌ పెట్టు. అలాగే,  నువ్వు ఏ సిటీలో ఉంటే అక్కడి నేను వచ్చి.. నీతో లైగర్‌ చూస్తా’ అని విజయ్‌ సమాధానమిచ్చారు.

విన్ను అనే మరో నెటిజన్‌.. ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ సినిమాల్లోని కొన్ని సిమిలర్‌ సన్నివేశాలను ఉపయోగించి స్పెషల్‌ వీడియో చేయగా.. ‘విన్ను నీ ఎడిటింగ్‌ స్కిల్‌ మస్త్‌ ఉంది. నువ్వు ప్రభాస్‌ అన్నని కలిసేలా నేను చేస్తా’ అని విజయ్‌ మాటిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని