Ravi Teja: ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఎంతంటే!

‘టైగర్‌ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao) అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమా రన్‌టైమ్‌ అంశం ఆసక్తికరంగా మారింది.

Published : 12 Oct 2023 10:49 IST

హైదరాబాద్‌:  తన తొలి పాన్‌ ఇండియా సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao)తో అలరించడానికి రవితేజ (Ravi Teja)సిద్ధమయ్యారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పనులు పూర్తి చేసుకుంది. అయితే, దీని రన్‌టైమ్ మాత్రం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు చిత్రబృందం తెలిపింది. ఇక దీని రన్‌టైమ్‌ ఏకంగా 3.02 గంటలు ఉంది. దీంతో ఈ ఏడాది అత్యధిక నిడివి ఉన్న సినిమాగా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ నిలిచింది. ఇంత రన్‌టైమ్‌ ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా అరుదు. అయితే, ఈ చిత్రం కచ్చితంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని నిర్మాణ బృందం పూర్తి నమ్మకంతో ఉంది. ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. 

‘నా ఇష్టం.. నేను అడల్ట్‌ సినిమాలు చేస్తా’.. నెటిజన్‌కు నిర్మాత కౌంటర్‌

1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రమిది. నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ కథానాయికలు. అలాగే, నటి రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆమె స్క్రీన్‌పై కనిపించనుండడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను సంజ్ఞా భాష (సైన్‌ లాంగ్వేజ్‌)లోనూ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. ఇలా విడుదలయ్యే తొలి భారతీయ చిత్రమిదేనని మూవీ యూనిట్‌ తెలిపింది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో అక్టోబర్‌ 19న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని