Klinkaara: క్లీంకార ఫొటో షేర్‌ చేసిన ఉపాసన.. క్యూట్‌ అంటూ కామెంట్స్‌

క్లీంకార (Klinkaara) ఫొటోను ఉపాసన షేర్‌ చేశారు. ఇవి ఎంతో అమూల్యమైన క్షణాలు అని పేర్కొన్నారు.

Published : 16 Aug 2023 10:43 IST

హైదరాబాద్‌: రామ్‌ చరణ్‌ (Ram Charan) - ఉపాసన (Upasana) ఇటీవల తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పాప పుట్టిన దగ్గరి నుంచి తన ఫొటో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా క్లీంకార ఫొటోను ఉపాసన షేర్‌ చేశారు.

నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉపాసన తన తల్లిదండ్రులు జెండా వందనం చేసిన ఫొటోను షేర్‌ చేశారు. అందులో వారు క్లీంకారను ఎత్తుకుని ఉన్నారు. ఇక ఈ ఫొటోను పంచుకున్న ఉపాసన ‘‘తన అమ్మమ్మ-తాతయ్యలతో క్లీంకార మొదటి స్వాతంత్ర్య వేడుకలు. ఇవి ఎంతో అమూల్యమైన క్షణాలు’’ అని రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరలవుతుండగా.. ఇది చూసిన అభిమానులు క్యూట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాలీ.. ట్రాన్స్‌జెండర్‌గా సుస్మితాసేన్‌ నటించిన సిరీస్‌ ఎలా ఉంది?

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన.. క్లీంకారను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘క్లీంకార పుట్టిన తర్వాత నా జీవితం ఎంతో మారింది. ఇప్పుడు నేనెంతో ఆనందంగా ఉన్నా. జీవితం విలువను తను నాకు తెలియజేసింది. తన వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నా’’ అని ఆమె అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని