Venkatesh: ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సీక్వెల్‌.. వెంకటేశ్‌ ఏమన్నారంటే?

తన 75వ చిత్రం ‘సైంధవ్‌’ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో వెంకటేశ్‌ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సీక్వెల్‌పై స్పందించారు.

Published : 11 Dec 2023 18:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిట్‌ చిత్రాలకు సీక్వెల్‌ వస్తే బాగుంటుందని చాలామంది సినీ ప్రియులు కోరుకుంటారు. అలా వెంకటేశ్‌ అభిమానులు కోరుకునే వాటిలో ‘నువ్వు నాకు నచ్చావ్‌’ (Nuvvu Naaku Nachav) సినిమా సీక్వెల్‌ ఒకటి. దీనిపై ప్రెస్‌మీట్‌లో ప్రశ్న ఎదురవగా వెంకటేశ్‌ (Venkatesh) స్పందించారు. ‘మీరు వెంటనే త్రివిక్రమ్‌కు ఫోన్‌ చేసి కథ రాయమని చెప్పండి’ అంటూ ప్రశ్న అడిగిన విలేకరికి సమాధానమిచ్చి నవ్వులు పూయించారు. నచ్చిన పాత్రలే పోషిస్తామని, డ్రీమ్‌ రోల్‌ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదన్నారు. హీరోలందరితోనూ కలిసి నటించేందుకు ఎప్పుడూ సిద్ధమే అని తెలిపారు.

‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ మొదలయ్యేది అప్పుడే..: మనోజ్‌ బాజ్‌పాయ్‌

ఈయన హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). శ్రద్ధా శ్రీనాథ్‌, ఆండ్రియా, రుహానీ శర్మ, ఆర్య, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది జనవరి 13న సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా వెంకటేశ్‌, శ్రద్ధా, శైలేష్‌, నిర్మాత వెంకట్‌ బోయనపల్లి తదితరులు విజయవాడ, గుంటూరు నగరాలను సందర్శించారు. కనకదుర్గ (విజయవాడ) దర్శనం అనంతరం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. 2001లో విడుదలైన ‘నువ్వు నాకు నచ్చావ్‌’ ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కె. విజయభాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ కథ అందించారు.

‘వీవీఐటీ’, ‘కేఎల్‌యూ’ల్లో పాట విడుదల..

వీవీఐటీ, కేఎల్‌ యూనివర్సిటీలో విద్యార్థుల సమక్షంలో ఈ చిత్రంలోని ‘సరదా సరదాగా’ గీతాన్ని విడుదల చేశారు. వేదికపై వెంకటేశ్‌ డ్యాన్స్‌ చేసి, డైలాగ్‌ చెప్పి ఆకట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరంతా నాపై ఇంతటి ప్రేమ కురిపించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. బాగా చదువుకోండి. ఏకాగ్రతతో పనిచేయండి. క్రమశిక్షణ అలవరచుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించండి. నెగెటివ్‌ ఆలోచనలు వస్తే ఆనందంగా ఉండలేం’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని