Vikrantrona: నాగార్జున ధైర్యం చేసి మాకోసం స్టూడియో గేట్స్ ఓపెన్ చేశారు: సుదీప్
సుదీప్ (Sudeep) హీరోగా నటించిన ‘విక్రాంత్ రోణ’ (Vikrantrona) 3డీ ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్...
హైదరాబాద్: సుదీప్ (Sudeep) హీరోగా నటించిన ‘విక్రాంత్ రోణ’ (Vikrantrona) 3డీ ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad), దర్శకుడు రాంగోపాల్ వర్మ(RGV), నటుడు అఖిల్(Akhil) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇందులో హీరో సుదీప్ మాట్లాడుతూ.. ‘‘మా చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎంతోమంది కలిస్తేనే ఈ సినిమా సిద్ధమైంది. నాలుగేళ్లుగా అనూప్ నేనూ కలిసి పనిచేస్తున్నాం. రోణ పాత్ర తీర్చిదిద్దడానికే మాకెంతో సమయం పట్టింది. సినిమా ప్రారంభించిన కొంతకాలానికే కరోనా రావడంతో షూట్ నిలిచిపోయింది. అలాంటి సమయంలో మేమంతా హైదరాబాద్‌కు వచ్చి సుమారు రెండు నెలలు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఉన్నాం. నాగార్జున ధైర్యం చేసి మాకోసం స్టూడియో తలుపులు తీశారు. ఒక్క కరోనా కేసు కూడా లేకుండా సినిమా షూట్ పూర్తి చేశాం. మాతో పాటు షూట్ ప్రారంభించిన చాలామంది మూడు, లేదా నాలుగు రోజులు చేయగానే కరోనా కేసులు రావడంతో వాయిదా వేసుకున్నారు. రాజమౌళి, విజయేంద్రప్రసాద్ ఇచ్చిన ‘ఈగ’ వల్లే నన్ను ఇక్కడి ప్రేక్షకులందరూ గుర్తుపడుతున్నారు. అందుకు వాళ్లకు ధన్యవాదాలు’’ అని సుదీప్ అన్నారు.
అనంతరం అఖిల్ (Akhil) మాట్లాడుతూ.. ‘‘విక్రాంత్‌రోణ’ ట్రైలర్ చూసినప్పుడే ఇది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సినిమా అనిపించింది. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన టీమ్ మొత్తానికి అభినందనలు. సుదీప్ నాకు పదేళ్ల నుంచి తెలుసు.. లుక్స్, వాయిస్ మాత్రమే కాదు ఆయన మైండ్ కూడా ఎంతో పవర్ఫుల్. ఒక యువ నటుడిగా ఎప్పుడూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటా. ఇలాంటి సినిమాలతో మాలో స్ఫూర్తి నింపుతున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. కన్నడ పరిశ్రమ నుంచి మరో రికార్డ్స్ క్రియేట్ చేసే మూవీ ఇది అవుతుందని నమ్ముతున్నా. మనమంతా సౌత్ ఇండియన్స్ అయినందుకు గర్వంగా ఉంది’’ అని అన్నారు.
ఆర్జీవీ(RGV) మాట్లాడుతూ.. ‘‘కన్నడ సినిమాలకు మొదట్లో ఆదరణ తక్కువ. కానీ, ఇప్పుడు ‘కేజీయఫ్’తో కన్నడ చిత్రపరిశ్రమ ఇండియా మొత్తానికి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ‘విక్రాంత్‌రోణ’ రఫ్ వెర్షన్ చూశా. కథ, సుదీప్ నటన, అనూప్ తెరకెక్కించిన విధానం నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇలాంటి అత్యద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌లను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. ఇందులోని ఓ పాట, దాన్ని తెరకెక్కించిన విధానం అదుర్స్. జాక్వెలిన్ డ్యాన్స్ కన్నా మంగ్లీ వాయిస్ సూపర్‌గా ఉంది. సుదీప్ కెరీర్లోనే ఇది ది బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందనుకుంటున్నా’’ అని తెలిపారు.
‘‘అక్కినేని కుటుంబంతో నాకెంతో మంచి అనుబంధం ఉంది. నేను చూసిన మొదటి తెలుగు సినిమా ‘గీతాంజలి’ (Geethanjali). నా మొదటి రెండు చిత్రాల పోస్ట్ ప్రొడెక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరిగాయి. అలాగే, ఇప్పుడీ ‘విక్రాంత్‌రోణ’ షూట్ కూడా చాలా వరకూ ఇక్కడే జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫుటేజీలను నాగార్జున చూసి వ్యక్తిగతంగా నన్ను పిలిచి, ప్రశంసించారు. నేను ఎంతగానో అభిమానించే నటుడి నుంచి ప్రశంసలు రావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ కూడా మా చిత్రానికి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. విజయేంద్రప్రసాద్.. ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది’’ అని చిత్ర దర్శకుడు అనూప్ తెలిపారు. జులై 28న ఈ సినిమా విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్‌లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.