#NTR30: హీరోయిన్ ఈమేనా?
బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆలియాభట్, సాయిమంజ్రేకర్ ఇప్పటికే టాలీవుడ్లో అవకాశాలు సొంతం చేసుకుని తమ అదృష్టానికి పరీక్షించుకోవడానికి సిద్ధం కాగా ఇప్పుడు మరో బ్యూటీ నగరంలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది...
బీటౌన్ నుంచి ల్యాండైన మరో ముద్దుగుమ్మ
హైదరాబాద్: బాలీవుడ్ ముద్దుగుమ్మలు అలియాభట్, సయీ మంజ్రేకర్ ఇప్పటికే టాలీవుడ్లో అవకాశాలు సొంతం చేసుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం కాగా ఇప్పుడు మరో బ్యూటీ నగరంలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో #NTR30 గురించి సినీ ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లుకొడుతోంది.
అతి త్వరలో రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ సినిమాలో ‘లవ్యాత్రి’తో మెప్పించిన బాలీవుడ్ నటి వరీన హుస్సేన్ అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టెస్ట్ షూట్ కోసం ఆమె ఇటీవల హైదరాబాద్లో ల్యాండ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె నటన పట్ల త్రివిక్రమ్ సుముఖత వ్యక్తం చేశారని దీంతో ఆమెకు ఈ సినిమాలో ఓ పాత్రను ఇచ్చారని నెట్టింట్లో చెప్పుకుంటున్నారు. సెకండ్ హీరోయిన్గా ఆమె కనిపించే అవకాశం ఉన్నట్లు భోగట్టా. మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ పనుల్లో బిజీగా ఉండగా.. త్రివిక్రమ్ సైతం పవన్, రానా సినిమాకి మాటలు అందిస్తున్నారు.
ఇదీ చదవండి
అందరూ వచ్చారు కానీ వీళ్లే ఆగిపోయారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.