ఇప్పటికైనా ఆ ఆరోపణలు మానుకోండి:లక్ష్మణ్‌

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

Updated : 30 Sep 2020 16:00 IST

హైదరాబాద్‌: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. బాబ్రీ వ్యవహారంలో ఏ విధమైన కుట్ర లేదని.. ఉద్దేశపూర్వకంగా ఆ ఘటన జరగలేదని న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. ఈ మేరకు లక్ష్మణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఇన్నాళ్లూ బాబ్రీ కూల్చివేత ఘటనపై కాంగ్రెస్ సహా పలు రాజకీయ పక్షాలు భాజపాపై చేస్తున్న ఆరోపణలు తప్పని తాజా తీర్పుతో రుజువైందన్నారు. ఇప్పటికైనా ఆయా పార్టీలు తప్పుడు ఆరోపణలు, మత రాజకీయాలు మానుకోవాలని లక్ష్మణ్‌ హితవు పలికారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల ఆకాంక్ష మేరకు అయోధ్యలో రామ మందిరం కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇతరుల మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు భాజపా ఎప్పుడూ ప్రయత్నించలేదని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని