హిందుత్వానికి అర్థం చెప్పిన ఫడణవీస్‌ 

హిందుత్వ అంటే ఓర్పు, సహనంతో కలిగి ఉండటమేనని భాజపా సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. కొవిడ్‌ 19కి ముందే మతతత్వం, కఠినమైన జాతీయవాదం అనే..........

Published : 21 Nov 2020 20:43 IST

మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ వ్యాఖ్యలపై కామెంట్‌ 

నాగ్‌పూర్‌: హిందుత్వ అంటే ఓర్పు, సహనంతో కలిగి ఉండటమేనని భాజపా సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. కొవిడ్‌ 19కి ముందే మతతత్వం, కఠినమైన జాతీయవాదం అనే రెండు మహమ్మారులకు బాధితురాలిగా సమాజం మారిందంటూ మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. హిందుత్వం అనేది ఎప్పుడూ కఠినమైనది కాదన్నారు. ఎల్లప్పుడూ సహనాన్నే ప్రబోధిస్తుందని, ఇది భారతదేశ ప్రాచీన జీవనవిధానమని చెప్పారు. 

హిందువులు ఎవరిపైనా, ఏ దేశంపైనా, ఏ రాష్ట్రం మీదా దాడులు చేయలేదన్నారు.  హిందుత్వం ఎల్లప్పుడూ సహనాన్ని బోధించడం వల్లే భారతదేశంలో అనేక విశ్వాసాలు, కులాలకు చెందిన ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు. ఈ నెల 23 నుంచి మహారాష్ట్రలో 9 నుంచి 12 తరగతులకు పాఠశాలలు తెరిచే అంశంపై ఆయన స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడం వల్ల కరోనా కేసులు పెరిగిన అనుభవాలను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు