పీఎం కేర్స్‌కు చైనా నుంచి నిధులు అందాయా?

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరం పీఎం కేర్స్‌ నిధి సేకరణకు సంబంధించి పలు సందేహాలను లేవనెత్తారు.

Published : 20 Aug 2020 01:09 IST

కాంగ్రెస్‌ నేత చిదంబరం సూటి ప్రశ్న

దిల్లీ: కరోనా కట్టడి కోసం ఉద్దేశించిన పీఎం కేర్స్‌ నిధులను జాతీయ విపత్తు నిర్వహణ నిధికి (ఎన్డీఆర్‌ఎఫ్‌) మళ్లించేలా ఆదేశించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ రెండూ వేర్వేరు లక్ష్యాలు కలిగిన వేర్వేరు నిధులని ఈ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత చిదంబరం సుప్రీంకోర్టు తీర్పు అంతిమం అంటూనే.. పీఎం కేర్స్‌ నిధి సేకరణకు సంబంధించి పలు సందేహాలను లేవనెత్తారు. వాటిని ట్విటర్‌ మాధ్యమంలో తెలియజేశారు.
*పీఎంకేర్స్ నిధికి మార్చి 2020 మొదటి ఐదు రోజల్లో రూ.3076 కోట్ల విరాళం అందించిన దాతలెవరు?ఆ జాబితాలో చైనా సంస్థలు కూడా ఉన్నాయా?
*కొవిడ్‌-19 కార్యకలాపాలకు నిధి నుంచి డబ్బును కేటాయించే విధి విధానాలు ఏవి?
*లబ్దిదారుల నుంచి వినియోగ ధృవీకరణ పత్రాలను (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌) తీసుకుంటున్నారా?
*ఈ నిధి సమాచార హక్కు పరిధి వెలుపల ఉన్నట్లయితే.. దీని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఎవరు వెల్లడిస్తారు?

పీఎం కేర్స్‌ సంబంధించి పారదర్శకత, వివరాల వెల్లడి, నిర్వహణ పద్ధతి తదితర అంశాలు న్యాయస్థానం సమక్షానికి రాలేదని చిదంబరం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. న్యాయస్థానం ఈ నిధి చట్టబద్ధతను గురించి మాత్రమే తీర్పునిచ్చిందని... దీని గురించి చర్చలు కొనసాగుతూనే ఉంటాయని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని