బెంగాల్‌ భాజపా అధ్యక్షుడి కాన్వాయ్‌పై రాళ్లు!

పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కాన్వాయ్‌పై  దాడి కలకలం రేపింది. అలీపుర్దువర్‌ జిల్లాలో జైగాన్‌ ప్రాంతంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వి, నల్ల జెండాలతో నిరసన తెలిపినట్టు ..........

Published : 13 Nov 2020 00:51 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కాన్వాయ్‌పై  దాడి స్థానికంగా కలకలం రేపింది. అలీపుర్దువర్‌ జిల్లాలో జైగాన్‌ ప్రాంతంలో ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వి, నల్ల జెండాలతో నిరసన తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. గుర్ఖా జన్‌ముక్తి మోర్చ (జీజేఎం) కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి అక్కడినుంచి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో దిలీప్‌ ఘోష్‌ వాహనం పాక్షికంగా ధ్వంసమైనట్టు భాజపా వర్గాలు తెలిపాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అనంతరం దిలీప్‌ ఘోష్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించే తృణమూల్‌ కాంగ్రెస్‌, మిత్రపక్షాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఏదైమైనా ఇలాంటి ఎత్తుగడలు పనిచేయవని.. ప్రజలు తమవెంటే ఉన్నారన్నారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తుందన్నారు. చాయ్‌పే చర్చా కార్యక్రమంలో పాల్గొని వేరే కార్యక్రమానికి వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు.  అయితే, దీనిపై ఆ జిల్లా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సౌరవ్‌ చక్రవర్తి స్పందించారు. నార్త్‌ బెంగాల్‌లో  సమస్యలు సృష్టించేందుకు దిలీప్‌ ఘోస్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనతో తమ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని