Ts Congress: కాంగ్రెస్‌కు మరో షాక్‌.. దాసోజు శ్రవణ్‌ రాజీనామా?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి...

Updated : 05 Aug 2022 16:09 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించి రెండు రోజులు గడవకముందే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కాసేపట్లో  మీడియా ముందు ప్రకటించనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పీసీసీ వైఖరి పట్ల శ్రవణ్‌ అసంతృప్తిగా ఉన్నారు. పీజేఆర్‌ కుమార్తె విజయరెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆయన అలిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. శ్రవణ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు తెలియగానే ఆ పార్టీ నేతలు కోదండరెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కలిసి దాసోజు ఇంటికి చేరుకున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవద్దంటూ  బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని