Amit Shah: ఎన్డీఏలోకి కొత్త మిత్రులు.. ఏపీలో పొత్తులపై స్పందించిన అమిత్‌ షా

ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 10 Feb 2024 19:34 IST

దిల్లీ: ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఆయన స్పందించారు. ఎకనమిక్‌ టైమ్స్‌ సమ్మిట్‌లో మాట్లాడిన అమిత్‌ షా.. ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్‌ కుటుంబ పరంగా బాగుంటుందన్న అమిత్‌ షా.. రాజకీయ కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొందరు కూటమి నుంచి బయటకు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలోని  రాజకీయ పరిస్థితులు ఉత్కంఠగా మారాయి. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీలో అమిత్‌షాతో సమావేశమై చర్చలు జరిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని