Updated : 26 Jan 2022 04:33 IST

AP politics: వైకాపారూలింగ్‌ పార్టీ కాదు.. ట్రేడింగ్‌ పార్టీ : సోము వీర్రాజు

విజయవాడ : సంక్రాంతి ఎలా ఉంటుందో తెలియజేసేందుకే గుడివాడ వెళ్లామని ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సంక్రాంతి అంటే క్యాసినో డ్యాన్సులు కాదని ఎద్దేవా చేశారు. అలాంటి డ్యాన్సులంటే మంత్రికి ఇష్టమేమో అని వ్యాఖ్యానించారు. గుడివాడ వెళ్తున్న మమ్మల్ని  పోలీసులు ఏ దృష్టితో అరెస్టు చేశారని ప్రశ్నించారు. అల్లరి మూకలు దాడి చేసే అవకాశముందని, అందుకే అడ్డుకున్నామని పోలీసులు చెప్పడంపై ఆయన పెదవి విరిచారు. అలాంటి సమాచారం ఉన్నప్పుడు వారిని ఎందుకు అరెస్టు చెయ్యలేదని ప్రశ్నించారు. క్యాసినో నిర్వాహకులను ఇప్పటి వరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ద్వజమెత్తారు. 2024లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు పుష్కరాలను తలపించేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర రాజధానిని మూడేళ్లలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వైకాపా రూలింగ్‌ పార్టీకాదు.. ట్రేడింగ్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు.

ప్రివిలేజ్‌ మోషన్‌ దాఖలు చేస్తా : సీఎం రమేశ్‌

ఏపీలో రూల్ ఆఫ్ లాను అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసులపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేస్తానని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. కృష్ణాజిల్లాలో అరెస్టు చేసిన భాజపా నాయకులను విడుదల చెయ్యకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ‘చలో పోలీస్ స్టేషన్’కు పిలుపునిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాకు అనుగుణంగా పోలీసులు పని చేస్తారా? లేదా? అంటూ డీజీపీని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని