RK Roja: 3 రాజధానులకు మద్దతుగా ఆలయాల్లో పూజలు చేయండి: మంత్రి రోజా

విజయదశమి రోజున ప్రజలందరూ దేవాలయాలకు వెళ్లి 3 రాజధానులకు మద్దతుగా పూజలు చేయాలని మంత్రి రోజా పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్‌ .. పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

Published : 04 Oct 2022 17:16 IST

తణుకు: విజయదశమి రోజున ప్రజలందరూ దేవాలయాలకు వెళ్లి 3 రాజధానులకు మద్దతుగా పూజలు చేయాలని మంత్రి రోజా పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్‌ .. పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అలాంటి ప్రభుత్వానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని సీఎం జగన్‌ ఆలోచిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం కోసం జగన్‌ పోరాటం చేస్తుంటే.. తన బినామీలను కాపాడుకోవడానికి కేవలం 29 గ్రామాల కోసం చంద్రబాబు నాయుడు నకిలీ పోరాటం చేస్తున్నారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జాతీయస్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగుడు  పోటీలను మంత్రి కారుమూరు నాగేశ్వరరావుతో కలిసి రోజా ప్రారంభించారు. అనంతరం సరదాగా ఎండ్లబండిని తోలారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని