Nellore: అక్రమ మైనింగ్‌పై చర్యలేవి? అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy), తెదేపా నేతలు ఆరోపించారు.

Published : 18 Dec 2023 15:15 IST

నెల్లూరు: జిల్లాలో క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy), తెదేపా నేతలు ఆరోపించారు. దీనిపై స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్‌ కూర్మనాథ్‌ని వారు కలిశారు. అక్రమ మైనింగ్‌పై అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. పొదలకూరు మండలంలో గత కొన్ని రోజులుగా క్వార్ట్జ్‌ను అక్రమంగా తరలిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. 

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మైనింగ్ క్వారీ వద్దే రెండు రోజులుగా సత్యాగ్రహం చేస్తున్నా.. అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. అసలు మైనింగ్‌కు అనుమతి ఉందో లేదో చెప్పాలని కోరడంతో.. మైనింగ్‌ డీడీని జేసీ పిలిపించారు. డీడీ వచ్చే వరకు ఎమ్మెల్యే సహా తెలుగుదేశం నేతలు అక్కడే కూర్చున్నారు. కొంత సమయానికి డీడీ శ్రీనివాస్ వచ్చి అనుమతి లేదని చెప్పడంతో.. చర్యలు తీసుకునేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇవాళే వెళ్లి చర్యలు తీసుకుంటామని అధికారి చెప్పడంతో నేతలు వెనుదిరిగారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని