MP Avinash: సీబీఐ అధికారులకు ఎంపీ అవినాష్‌రెడ్డి మరో లేఖ

ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేస్తుందంటూ వార్తలు వస్తున్న తరుణంలో అవినాష్‌ మరోసారి సీబీఐ అధికారులకు లేఖ రాశారు.

Updated : 22 May 2023 14:12 IST

కర్నూలు: ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేస్తుందంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆయన మరోసారి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నెల 27వ తేదీ వరకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ అధికారులను లేఖలో విజ్ఞప్తి చేశారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

రెండో సారి ఎస్పీని కలిసిన సీబీఐ అధికారులు

అవినాష్‌ రెడ్డి అరెస్టు విషయంలో కర్నూలు ఎస్పీని సీబీఐ అధికారులు మరోసారి కలిశారు. సీబీఐ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అవినాష్ అరెస్టుపై ఎస్పీ కృష్ణకాంత్ స్పష్టత ఇవ్వడం లేదు. డీజీపీ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నట్లు సమాచారం.

సెంట్రల్‌ ఫోర్స్‌ సాయంతో అవినాష్‌ అరెస్టు?

సీబీఐ అధికారులు ఐదుగురు సభ్యులు మూడు వాహనాల్లో కర్నూలుకు చేరుకొని పోలీస్‌ గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. మరో వైపు విశ్వభారతి ఆసుపత్రి వద్ద వైకాపా కార్యకర్తలు బైఠాయించారు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు బారిగేట్లు ఏర్పాటు చేసి వారిని నియంత్రిస్తున్నారు. సెంట్రల్ ఫోర్స్ సాయంతో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని