praja sangrama yatra: ప్రజా సంగ్రామ యాత్ర.. భారీ కాన్వాయ్‌తో జోగులాంబ బయల్దేరిన బండి సంజయ్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ సాయంత్రం ప్రారంభం కానుంది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 10 నియోజకవర్గాల పరిధిలో 105 గ్రామాల్లో

Updated : 14 Apr 2022 15:09 IST

హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ సాయంత్రం ప్రారంభం కానుంది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 10 నియోజకవర్గాల పరిధిలో 105 గ్రామాల్లో కొనసాగనున్న యాత్రను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ అలంపూర్‌లో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో బండి సంజయ్‌ జోగులాంబ ఆలయానికి బయలుదేరారు. అలంపూర్‌ చేరుకున్న తర్వాత అంబేడ్కర్‌ విగ్రహానికి సంజయ్‌ నివాళులర్పించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ తర్వాత రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుంది. జోగులాంబ నుంచి ఇమాన్‌పూర్ వరకు బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతుంది. ఇమాన్‌పూర్‌లో బండి సంజయ్‌ రాత్రి బస చేయనున్నారు. రాత్రి బండి సంజయ్‌ బస చేసే ప్రాంతానికి వెళ్లనున్న కిషన్‌ రెడ్డి.. అక్కడే శిబిరంలో వారితో కలిసి భోజనం చేయనున్నారు. పాదయాత్ర శిబిరంలోనే ఇవాళ రాత్రి బస చేయనున్న కిషన్‌ రెడ్డి.. శుక్రవారం ఉదయం సంజయ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు.

31 రోజులపాటు..

రెండో విడత పాదయాత్ర 31 రోజులపాటు కొనసాగనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో యాత్ర కొనసాగించి, మధ్యాహ్న సమయంలో పార్టీ రాష్ట్రస్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు. మొత్తం 387 కి.మీ దూరం సాగే కార్యక్రమం.. మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ముగుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని