Munugode Bypoll: ఫలితాల వెల్లడిలో సీఈవో తీరు అనుమానాస్పదం: బండి సంజయ్‌

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ వైఖరిని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తప్పుబట్టారు.

Updated : 06 Nov 2022 11:52 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ వైఖరిని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తప్పుబట్టారు. ఫలితాల వెల్లడిలో సీఈవో తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. తెరాస ఆధిక్యంలోకి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్‌ చేయడం లేదని.. భాజపా లీడింగ్‌లోకి వచ్చినా వెల్లడించడం లేదని ఆయన ఆరోపించారు.

మొదటి రెండు రౌండ్ల తర్వాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్‌డేట్‌ చేసేందుకు గల జాప్యానికి కారణాలేంటో సీఈవో చెప్పాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలున ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు. 

సీఈవోకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌

మరోవైపు ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందంటూ సీఈవోకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని  కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్రమంత్రి ఫోన్‌ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను సీఈవో అప్‌లోడ్‌ చేసినట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని