Bandi Sanjay: కేసీఆర్‌.. తెలంగాణ డబ్బులు పంజాబ్‌లో పంచి పెడతారా?: బండి సంజయ్‌

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భూదాన్‌ పోచంపల్లి మండలం ముక్తాపూర్‌ నుంచి ఐదో రోజు ప్రారంభమైన బండి సంజయ్‌ పాదయాత్ర 

Published : 08 Aug 2022 02:15 IST

భూదాన్‌ పోచంపల్లి: ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భూదాన్‌ పోచంపల్లి మండలం ముక్తాపూర్‌ నుంచి ఐదో రోజు ప్రారంభమైన బండి సంజయ్‌ పాదయాత్ర చింతబావి, రేవణపల్లి, భూదాన్‌ పోచంపల్లి పట్టణం మీదుగా సాగింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ, మహిళలు, చిన్నారులను పలకరిస్తూ యాత్ర కొనసాగించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా పోచంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 360మంది చేనేత కార్మికులు చనిపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శంచారు. పంజాబ్‌లో రైతులు ఆత్మహత్య చేసుకుంటే 700 మందికి నష్టపరిహారం పేరుతో ఇక్కడి నిధులు అక్కడ ఇచ్చారని ఆరోపించారు. భాజపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మగ్గాలకు జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేస్తాం, చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తాం, ఇళ్లులేని అర్హులైన కార్మికులకు ఇళ్లు నిర్మించి ఇస్తాం అని బండి సంజయ్‌ హామీ ఇచ్చారు. 

నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లకుండా కేసీఆర్‌ దాన్ని కూడా విమర్శిస్తున్నారన్నారు. చేనేత కార్మికులు, ఇంటర్‌ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగాల విషయంలో కేసీఆర్‌ ముందే స్పందించి ఉంటే ఆత్మహత్యలు ఉండేవి కావన్నారు. పోచంపల్లి మండలానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు