‘సెక్యులర్‌’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్‌షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్‌

భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్‌’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 05 May 2024 06:56 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్‌’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ డిమాండ్‌ చేశారు. ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సెక్యులర్‌’ భావాలతో పని చేసేది కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. రాయ్‌బరేలీలో రాహుల్‌గాంధీ నామినేషన్‌ వేస్తే..ఆయనను ఉద్దేశించి మోదీ ‘డరోమత్‌, భాగో మత్‌’ అనడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే అవుతుందన్నారు. ఇప్పటికే మోదీపై ఐదుసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని