భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ రాజీనామా

భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.

Updated : 05 May 2024 06:20 IST

ఈనాడు, దిల్లీ: భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. మెదక్‌ జిల్లా నాయకుడు మహమ్మద్‌ మొహినుద్దీన్‌, వరంగల్‌ జిల్లా నాయకుడు, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు తీగల లక్ష్మణ్‌గౌడ్‌లు సైతం భారాసను వీడుతున్నట్లు వెల్లడించారు. 2022లో కేసీఆర్‌ ఆహ్వానం మేరకు భారాసలో చేరానని, అయితే వారికి తనలాంటి వారి అవసరం ఉంటుందని అనిపించడంలేదని రాపోలు పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు ఓర్వలేని నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గణాంకాల కోసమే కేసీఆర్‌ గతంలో సకల జనుల సర్వే చేశారని.. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అసలైన కుల గణన దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని