KTR: ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బ తీశారు: కేటీఆర్‌

రాష్ట్ర హక్కులు సాధించాలంటే లోక్‌సభ ఎన్నికల్లో భారాస గెలిచి తీరాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Published : 02 Feb 2024 15:12 IST

ఘట్‌కేసర్‌: తెలంగాణ హక్కులు సాధించాలంటే లోక్‌సభ ఎన్నికల్లో భారాస గెలిచి తీరాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ భారాస విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. 420 హామీలిచ్చి కాంగ్రెస్‌ ఎన్నికల్లో గెలిచిందన్నారు. డిసెంబర్‌ 9న రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారని.. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఆ ప్రస్తావనే లేదని అసహనం వ్యక్తం చేశారు.

‘‘వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఉచిత బస్సుల వల్ల పరిస్థితి ఎలా తయారైందో అందరికీ తెలుసు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతీశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ వస్తేనే ఆరు గ్యారంటీల అమలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదు. కృష్ణా జలాల్లో కేంద్రం మన వాటా తేల్చాలి. కేఆర్‌ఎంబీకి మన కృష్ణా జలాలు తాకట్టు పెట్టారు. సీఎం రేవంత్‌ రెడ్డి లాంటి వాళ్లను ఎంతో మందిని చూశాం. మన బాస్‌లు దిల్లీ, గుజరాత్‌లో లేరు. దిల్లీలో మన మాట వినపడాలంటే భారాసకు ఓటు వేయాలి. గులాబీ జెండాకు ఓటు వేస్తేనే మన గొంతుక ఉంటుంది’’ అని కేటీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు