Published : 15 Jul 2021 01:34 IST

రాజధానిపై తప్పు సరిదిద్దుకున్నారు: చంద్రబాబు

అమరావతి: కేంద్ర హోంశాఖకు చెందిన సీపీఐఓ డైరెక్టర్‌ రేణు సరిన్‌.. అమరావతి బదులుగా ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు ఉన్నాయని సమాచార హక్కు చట్టంకింద చేసిన దరఖాస్తుకు తప్పుగా ఇచ్చిన సమాధానం సరిచేసుకోవటం హర్షణీయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారిని తప్పుదారి పట్టించి, వాస్తవాలు తారుమారు చేశారని స్పష్టమవుతోందన్నారు. సంబంధిత అధికారులతో సమస్యను పరిష్కరించి, తప్పును సరిచేయించిన జీవీఆర్‌ శాస్త్రిని అభినందిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.

ఏం జరిగిందంటే?

3రాజధానుల అంశంపై చైతన్యకుమార్‌రెడ్డి అనే వ్యక్తి గతంలో కేంద్ర హోంశాఖకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుకు కేంద్ర హోంశాఖ సీపీఐవో రేణు సరిన్‌ ఈ నెల 6న సమాధానమిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం-2020 ప్రకారం రాష్ట్రంలో 3పరిపాలన కేంద్రాలుంటాయి. వాటిని రాజధానులు అంటారు. రాష్ట్ర రాజధాని అంశాన్ని ఆ రాష్ట్రమే నిర్ణయించుకుంటుంది’ అని అందులో పేర్కొన్నారు. ఈ సమాధానంపై అమరావతి జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ జి.వి.ఆర్‌.శాస్త్రి అభ్యంతరం చెబుతూ కేంద్ర హోంశాఖ అప్పిలేట్‌ అథారిటీ అయిన సంయుక్త కార్యదర్శి ప్రకాష్‌కు ఈనెల 9న లేఖ రాశారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రం తరఫున సీపీఐవో తప్పుడు సమాచారమిచ్చారని పేర్కొన్నారు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని తెలిపారు. లేఖతో స్పందించిన కేంద్ర హోంశాఖ సీపీఐవో రేణు సరిన్‌ రాజధాని అంశం న్యాయ పరిధిలో ఉందంటూ తాను గతంలో ఇచ్చిన సమాధానానికి భిన్నంగా బదులిచ్చారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని