రఘురామపై తప్పుడు కేసులు పెడితే మాట్లాడొద్దా?

ఎంపీ రఘురామకృష్ణపై తప్పుడు కేసులు పెడితే తాము మాట్లాడకూడదా? అని తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎవరికిఎంపీ రఘురామకృష్ణపై తప్పుడు కేసులు పెడితే తాము మాట్లాడకూడదా? అని తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎవరికి

Published : 18 May 2021 01:47 IST

చంద్రబాబు ధ్వజం

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణపై తప్పుడు కేసులు పెడితే తాము మాట్లాడకూడదా? అని తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎవరికి అన్యాయం చేసినా నిలదీసేందుకు తమ పార్టీ ముందుంటుందన్నారు. ప్రజాస్వామ్యం- భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అనే అంశంపై నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తమ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల్ని తీసుకున్నారంటూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.  రాష్ట్రం అంటే ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదన్నారు. రఘురామ అరెస్టులో పోలీసులు నిబంధనలు పాటించలేదన్నారు. అధికారులు హద్దులు మీరి ప్రవర్తించడంసరికాదని, చట్టానికి లోబడే పనిచేయాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారులు కూడా శిక్షార్హులే అవుతారని చంద్రబాబు అన్నారు.

ప్రజాస్వామ్యవాదుల పోరాటానికి తెదేపా మద్దతు ఉంటుందన్నారు. ప్రత్యర్థులపై దేశద్రోహం పెడతారని తనకు తెలియదని, మీడియాపైనా రాజద్రోహం కేసు పెట్టే పరిస్థితికి వచ్చారన్నారు. వాస్తవాలు రాయకుండా మీడియా నియంత్రణకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చట్ట ఉల్లంఘనలు ఎలా జరుగుతున్నాయో ప్రజలుగమనించాలని సూచించారు. తామెప్పుడూ కుల ప్రస్తావనతో ఎదురుదాడి చేయలేదని చంద్రబాబు అన్నారు. కోర్టు సెలవులు చూసి మరీ జేసీబీలతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని, హద్దు దాటే అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు