Munugode: మునుగోడులో కాంగ్రెస్‌కు మద్దతుపై ఆలోచిస్తాం: కోదండరాం

మునుగోడు ఉపఎన్నికలో మద్దతివ్వాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను కాంగ్రెస్‌ పార్టీ కోరింది. దీనిపై స్పందించిన కోదండరాం.. తమకు కొంత సమయం కావాలని కోరారు. పార్టీలో అంతర్గతంగా చర్చించ..

Published : 17 Aug 2022 02:05 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికలో మద్దతివ్వాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను కాంగ్రెస్‌ పార్టీ కోరింది. దీనిపై స్పందించిన కోదండరాం.. తమకు కొంత సమయం కావాలని కోరారు. పార్టీలో అంతర్గతంగా చర్చించి వారం.. పది రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పినట్టు కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ఇవాళ సాయంత్రం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు కోదండరాంను కలిశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే తాము కోదండరాంను కలిసినట్టు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మల్లు రవి తెలిపారు. ‘‘మునుగోడులో ఏ పరిస్థితుల్లో ఉపఎన్నిక వచ్చిందో చెప్పాం. భాజపా, తెరాస కుమ్మక్కవడంతోనే ఉపఎన్నిక వచ్చిందని మేము నమ్ముతున్నాం. సిద్ధాంతపరంగా కలిసొచ్చే పార్టీల మద్దతు కోరుతున్నాం’’ అని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు