JP Nadda: కాంగ్రెస్‌కు ప్రతిపక్షంగా ఉండే అర్హత లేదు: జేపీ నడ్డా

విపక్ష పార్టీల్లోని నేతల వ్యక్తిగత లబ్ధి కోసం, వారి అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే ‘ఇండియా’ కూటమి ఏర్పడిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.

Published : 10 Jan 2024 22:07 IST

గువాహటి: కాంగ్రెస్‌ (Congress) పార్టీకి ప్రతిపక్షంగా ఉండే అర్హత లేదని భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) విమర్శించారు. బుధవారం అస్సాం రాజధాని గువాహటిలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాల్దీవుల వ్యవహారంలో కాంగ్రెస్‌ వైఖరిని తప్పుబట్టారు. 

‘‘కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేదు. ప్రతిపక్షంగా ఉండే అర్హతను కూడా ఆ పార్టీ కోల్పోయింది. విపక్ష పార్టీలకు చెందిన నాయకుల వ్యక్తిగత లబ్ధి కోసం, వారి అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే ‘ఇండియా’ కూటమి ఏర్పడింది. ఆ కూటమి నేతల్లో చాలా మందిపై సీబీఐ కేసులు ఉన్నాయి. ఆ కూటమికి, ఇండియా (దేశాన్ని ఉద్దేశించి)కు సంబంధం లేదు’’ అని నడ్డా విమర్శించారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రకు బదులుగా రాహుల్‌ గాంధీ.. భారత్‌ తోడో అన్యాయ్‌ యాత్ర చేపట్టాలని ఆయన సూచించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ దేశానికి తీరని అన్యాయం చేసింది. భారత్‌ను అన్ని విధాలుగా విభజించింది. ప్రస్తుతం న్యాయం కావాలంటూ యాత్ర చేస్తున్నారు. వాస్తవాన్ని ఎవరూ మార్చలేరు’’ అని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు