Telnagana News: ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. 80 స్థానాల్లో గెలుపే లక్ష్యం: మాణికం ఠాగూర్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణికం ఠాగూర్‌

Published : 10 Jul 2022 16:22 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మాణికం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, కోమటిరెడ్డితో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం మాణికం ఠాగూర్‌ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. దీనిపై విస్తృతంగా చర్చించాం. సిరిసిల్లలో ఏర్పాటుచేసే రాహుల్ గాంధీ సభపైనా చర్చించాం. మిషన్ తెలంగాణ మొదలైంది. ఏకాభిప్రాయంతోనే టిక్కెట్ల కేటాయింపు ఉంటుంది. అందరితో కలిసి పని చేస్తాం. అన్ని కులాలను కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ఒక్కరితో పార్టీ అధికారంలోకి రాదు. త్వరలో రాష్ట్రమంతా పర్యటిస్తాం. పార్టీలో చేరిన వాళ్లందరికీ టికెట్లు రావు’’ అని మాణికం ఠాగూర్‌ స్పష్టం చేశారు. 

ఆయన పార్టీకి నష్టం చేశారు: కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

‘‘నేనేమీ అసంతృప్తిగా లేను. పార్టీలో చురుగ్గానే ఉన్నా. దేన్నీ పట్టించుకోను. మొదటి నుంచి పార్టీలో ఉండి కష్టపడ్డ వారికే టికెట్లు ఇవ్వాలి. పార్టీ అధిష్ఠానాన్ని ఇదే కోరుతున్నా. పీఏసీకి రాలేనని నేను ముందే చెప్పాను. 29 మందితో కమిటీ వేస్తే.. దానికి వెళ్లి నేనేం మాట్లాడతాను. పీఎసీలో కమిటీ సభ్యుల సంఖ్యను కుదించాలి. డాక్టర్‌ రవి చేరిక చెల్లకపోతే బిల్యా నాయక్‌ చేరిక ఎలా చెల్లుతుంది? బిల్యా నాయక్‌ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి నష్టం చేశారు’’ అని కోమటిరెడ్డి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని