AIADMK: పళనికి షాక్‌.. పన్నీర్‌కు ఊరట

అన్నాడీఎంకేలో ఏకనాయకత్వ వ్యవహారంలో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలింది.

Published : 17 Aug 2022 17:21 IST

చెన్నై: అన్నాడీఎంకేలో ఏకనాయకత్వ వ్యవహారంలో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది.  ద్వంద్వ నాయకత్వ విధానాన్ని కొనసాగించాలని బుధవారం మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్‌ సెల్వంకు ఈ తీర్పు ఊరటనివ్వనుంది. 

అన్నాడీఎంకే పార్టీ పగ్గాల కోసం ఇ. పళనిస్వామి(E Palaniswami), ఒ. పన్నీర్ సెల్వం(O Panneerselvam) మధ్య తీవ్రస్థాయిలో పోరు జరిగింది. చివరకు నెగ్గిన మాజీ సీఎం పళనిస్వామి.. కొద్ది వారాల క్రితం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అన్నాడీఎంకే సమన్వయకర్తల పదవులను రద్దు చేయటంతో పాటు పన్నీర్‌ సెల్వం, ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రత్యేక తీర్మానం ఆమోదించారు. ఈ పరిణామాలపై పన్నీర్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. పళనిస్వామి ఎన్నిక పార్టీ నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఈ క్రమంలో పన్నీర్‌ సెల్వానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. పార్టీ ద్వంద్వ నాయకత్వంపై జూన్‌ 23 నాటి యథాతథ స్థితి కొనసాగుతుందని,  కొత్తగా జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని